crimeHome Page SliderInternationalNews AlertVideosviral

కిండర్ గార్డెన్ స్కూల్లో తల్లుల ఫైట్..అడ్డుకున్న చిన్నారులు

సాధారణంగా చిన్నపిల్లలు కొట్టుకుంటే పెద్దలు అడ్డుపడతారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే చిన్నపిల్లలు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కిండర్ గార్డెన్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఒక విషయంపై ఇద్దరు మహిళలు వాదించుకున్నారు. అది ముదిరి కొట్టుకునేవరకూ వెళ్లింది. వారి ఫైట్‌ను ఆపడానికి ప్రయత్నించిన భర్తలు కూడా కొట్టుకోవడం ప్రారంభించారు. దీనితో భయాందోళనలకు గురైన చిన్నారులు ఏడుస్తూ ‘మమ్మీ, డాడీ ఆపండి..’ అంటూ వారిని వేడుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పాఠశాల యాజమాన్యం కూడా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని, పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తామని ప్రకటించింది.