Home Page SliderNationalviral

కిటికీలోంచి బిడ్డను విసిరేసిన తల్లి

రాజస్థాన్‌లోని ఓ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తన బిడ్డను కాపాడాలని ప్రయత్నించిన ఓ తల్లి.. చిన్నారిని మూడో అంతస్తు నుంచి కిందకి విసిరేసింది. ఈ ఘటనలో అజ్మేర్‌లో చోటుచేసుకుంది.నాజ్‌ హోటల్‌లో ఎలక్ట్రికల్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, చిన్నారి ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక తల్లి తన బిడ్డను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. తన చిన్నారిని మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది.కింద ఉన్నవారు ఆ చిన్నారిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె కూడా దూకేందుకు ప్రయత్నించగా అందులోనే చిక్కుకుపోయింది. చిన్నారికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హోటల్‌లో ఉన్న ఏసీ పేలడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు.