InternationalNewsNews Alert

మొదటి స్ధానంలో మోదీ..5వ స్ధానంలో బైడెన్

సర్వే చేసింది అమెరికా సంస్ధ. అగ్రస్ధానంలో నిలిచింది నరేంద్ర మోదీ. ఒకరు కాదు ..ఇద్దరు కాదు.. 75 శాతం మంది సానుకూలంగా స్పందించి మోదీ పాలనకు జై కొట్టారు. ప్రపంచంలోని యోధాను యోధులైన నేతలందరినీ వెనక్కి నెట్టి భారత ప్రధాని ముందు నిలిచారు. మొత్తం 22 మంది దేశాధి నేతల్లో అత్యధిక రేటింగ్ సాధించిన ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్ధ నిర్వహించిన సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు  5వ స్ధానం లభించింది. ఆయన పట్ల కేవలం 41 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. ఇక మెక్సికో అధ్యక్షుడు ఆండ్రస్ మాన్యువల్ లోపెజ్ 2వ స్ధానంలో నిలిచారు. 63 శాతం మంది ఈయన పాలన పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఇక 54 శాతంతో ఇటలీ ప్రధాని మారియో డ్రాగి 3వ స్ధానాన్ని ఆక్రమించారు. 41 శాతం ఓట్లతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు  5వ స్ధానం దక్కింది. ఆ తర్వాత 39 శాతంతో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, 38 శాతంతో జపాన్ ప్రధాని పుమియో కిషిద ఉన్నారు.  

ప్రపంచంలోని  వివిధ దేశాలలో అధికారంలో ఉన్న నేతల పాలనాతీరు, వారికున్ ప్రజైమోదం వంటి అంశాలను అమెరికాకు చెందిన డేటా ఇంటిలిజెన్స్ సంస్ధ మార్నింగ్ కన్సల్ట్ ట్రాక్ చేస్తూ వస్తోంది. తనకున్న నెట్ వర్క్ ద్వారా అనేక అంశాలనీ సేకరించి క్రోడీకరించింది. ఇలా పలు దేశాల్లో ఇలాంటి సర్వేలను నిర్వహించింది.  గతంలో కూడా ఈ సంస్ధ నిర్వహించినన సర్వేలో ప్రధాని మోదీ యే అగ్రస్ధానంలో ఉన్నారు. తిరిగి ఇప్పుడు కూడా అదే స్ధానంలో ఉన్నట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్ధ తెలిపింది. చెక్కు చెదరని ఆదరణ నరేంద్ర మోదీకి ఉందని పేర్కొంది. ఈ సర్వేలో అగ్రదేశం అమెరికా అద్యక్షుడు చాలా వెనకబడ్డాడు. తమ సర్వేలో ఆయనకు ప్రజాదరణ చాలా తక్కువగా లభించిందని సర్వే సంస్ధ వెల్లడించింది.