ఉదయాన్నే కాఫీ త్రాగేవారు ఇది తెలుసుకోండి!
సాధారణంగా చాలా మందికి ఉండే అలవాటు ఉదయం లేవగానే కాఫీ తాగడం. ఉదయాన్నే కాఫీ తాగక పోతే వారికి ఆరోజు గడవదు. అందుకే పొద్దు పొద్దున్నే కాఫీ తాగుతుంటారు. కాని దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు అని డాక్టర్లు చెబుతున్నారు. కాఫీని ఒక నిర్ధిష్ట సమయంలో తాగితే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు. కాఫీ ఉదయాన్నే కాకుండా కాస్త ఆలస్యంగా అంటే 9.30 నుంచి 11.30 గంటల లోపు తాగడం మంచిది అని సూచిస్తున్నారు. దానివల్ల శరీరంలోని సహజ హార్మోన్లు మరింత స్థిరంగా ఉండేందుకు దోహదపడడమే కాకుండా అధికంగా ఉండే కార్టిసాల్ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి కాఫీ ఉదయాన్నే కాకుండా కొంచం ఆలస్యంగా తాగితేనే మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.


 
							 
							