Andhra PradeshHome Page Slider

ఒకే వేదికపై వైభవంగా వందకు పైగా షష్టిపూర్తి వేడుకలు

విశాఖలోని వాసవిక్లబ్ అధ్వర్యంలో ఒకే వేదికపై 102 జంటలకు వైభవంగా షష్టిపూర్తి వేడుకలు జరిగాయి. పెళ్లంటే యువతకే కాదు, వృద్ధులకీ సంబరమే. 60 ఏళ్ల వయస్సులో తన జీవితభాగస్వామినే మళ్లీ మనువాడే గొప్ప వేడుక షష్టిపూర్తి. అదీ ఒకే వేదికపై వందకు పైగా వృద్ధజంటలు ముచ్చటగా కళ్యాణదుస్తుల్లో వచ్చి వివాహమహోత్సవం జరుపుకుంటే వారి పిల్లల సంబరం, అంబరానంటింది. తమ తల్లిదండ్రులకు పెళ్లి చేసి మురిసిపోయారు వారి సంతానం. సంప్రదాయంగా పట్టు వస్త్రాలు ధరించి, కళ్యాణతిలకంతో ముచ్చటగా ఉన్న ఈ దంపతుల షష్టిపూర్తికి విశాఖ సిరిపురం బాలల ప్రాంగణం వేదికయ్యింది. దీనితో ఈ ప్రదేశమంతా సందడిగా మారింది.