Home Page SliderTelangana

దావత్‌లో మూలగ బొక్క ఎఫెక్ట్… ఆగిన పెళ్లి

వెరైటీల్లోనే వైరెటీ జరిగింది. సినిమాల్లో మాత్రమే సాధ్యమే ఈ సీన్ తాజాగా తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగింది. పెళ్లి కుమార్తె కుటుంబం మెనులో మూలగ బొక్క లేకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. వంటల్లో మూలగబొక్క లేకుండా మటన్ వండితారని పెళ్లి కుమార్తె కుటుంబీకులు చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వధువు తరపు నిర్ణయించిన మాంసాహార మెనూలో భాగంగా మూలగ బొక్క అందించ లేదంటూ వరుడి కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణలో ఓ పెళ్లి ఆగిపోయింది.

వధువు నిజామాబాద్‌కు చెందినవారు కాగా, వరుడు జగిత్యాలకు చెందినవారు. నవంబర్‌లో వధువు నివాసంలో నిశ్చితార్థం జరిగింది. అయితే తాజాగా వివాహాన్ని రద్దు చేసుకున్నారు. వధువు కుటుంబ సభ్యులు… వరుడి బంధువులతో సహా అతిథుల కోసం తయారు చేసిన మాంసంలో మూలగ బొక్కలు మిస్సయ్యాయి. నిశ్చితార్థ వేడుక తర్వాత మటన్ మూలగ బొక్క వడ్డించడం లేదని, పెళ్లి కొడుకు బంధువులు అడగడంతో గొడవ మొదలయ్యింది.

ఆతిథ్యం ఇచ్చే వధువు కుటుంబ సభ్యులు… వంటలో ఎముక మజ్జ లేదని చెప్పడంతో ఇరువర్గాలు గొడవకు దిగాయి. ఇక వెంటనే, పోలీసులు రంగంలోకి వచ్చి.. గొడవను సద్దుమనిగేలా చేసే ప్రయత్నం చేసారు. వరుడి కుటుంబీకులను గొడవను పరిష్కరించేందుకు ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వారు దానిని “అవమానం” గా భావించి పెళ్లిని రద్దు చేసుకున్నారు. మూలగ బొక్క లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా చేశారని వారు వాదించడం విశేషం. చివరికి, వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకోవడంతో ఎంగేజ్‌మెంట్ పార్టీ ముగిసింది.

(courtesy- balagam movie producers)

ఈ సంఘటన అత్యంత ప్రశంసలు పొందిన తెలుగు సినిమా కథాంశాన్ని పోలి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘బలగం’ రెండు కుటుంబాల మధ్య మూలగ బొక్క వివాదంతో పెళ్లి రద్దు చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు.