Home Page SliderNational

రెండ్రోజుల్లో రుతుపవనాలు రాక

కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఇక కేవలం రెండ్రోజులలోనే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లను కూడా పలుకరించబోతున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రావడం నాల్రోజులు ఆలస్యమయినా, వచ్చాక వాటి ప్రతాపం చూపిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. కేరళలో వేగంగా వ్యాపిస్తూ,ముమ్మరంగా వర్షాలు కురిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా ప్రవేశించి, చిరుజల్లులు కురిపిస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావంతో కేరళలో నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని, వాతావరణ శాఖ తెలియజేశింది. తొందరలోనే వేసవి తాపం నుండి తెలంగాణా ప్రజలకు ఉపశమనం లభించినట్లే.