కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో కొన్నాళ్లుగా ఆయన చిన్నకుమారుడు మంచు మనోజ్ ఉంటున్నారు. మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. పనివాళ్లు, ఇతరులను బయటకి పంపి మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.