BusinessHome Page SliderInternationalNews AlertPolitics

‘మోదీ స్ట్రాటజీ’.. కాళ్లబేరానికి బంగ్లాదేశ్..

భారత ప్రధాని నరేంద్రమోదీ స్ట్రాటజీకి బంగ్లాదేశ్‌కు బుద్ది వచ్చింది. భారత్ కాళ్లబేరానికి వచ్చి చర్చలకు దిగివచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు విధించింది భారత్. గత నెలలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చే సరుకులపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించడంతో భారత్ కూడా బంగ్లా సరుకులపై ఆంక్షలు విధించింది. అక్కడి నుండి వచ్చే రెడీమేడ్ దుస్తులు, ఆహార పదార్థాలు, పత్తి, నూలు, కూల్‌డ్రింక్స్, ప్లాస్టిక్, పీవీసీ, కలప ఫర్నిచర్ తదితర వస్తువులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే బంగ్లా నుండి వచ్చే చేపలు, ఎల్పీజీ, కంకర వంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించవు. ఈ సరుకులు కోల్‌కతా నౌకాశ్రయం, ముంబయి నౌకాశ్రయం నుండి మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు. భారత్ తీసుకున్న చర్యలపై తమకింకా అధికారిక సమాచారం రాలేదని, అఖౌరా, డాకి పోర్టులతో పాటు మరికొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు సమాచారం ఉందన్నారు బంగ్లా వాణిజ్య సలహాదారు. భారత్, బంగ్లాల పొరుగుదేశాలని, పరస్పరం రవాణా, వాణిజ్యంలో సహకరించుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో ఈ విషయాలపై చర్చలకు వచ్చి పరిష్కరించుకుంటామన్నారు.