దేశానికి మోదీ పాలన శ్రీరామరక్ష, మక్తల్ విజయశంఖారావంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
2013లో తెలంగాణ సాధనకోసం ఇక్కడ నుండే ప్రారంభించిన పోరు యాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలతోపాటు, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా పాల్గొన్నారు. మక్తల్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నాన్న కిషన్ రెడ్డి, నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారన్నారు. దేశంలోని అనేక రకాల సమస్యలను పరిష్కరించారని, ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరగలేదన్న కిషన్ రెడ్డి… . దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు 4కోట్ల ఇళ్లు కట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, పొగ బారిన పడకుండా దేశంలోని పేద మహిళలకు కోట్లాది గ్యాస్ కనెక్షన్లు అందించారన్నారు. ప్రతీ పేదవాడికి ఉచితంగా 5 కేజీల బియ్యం… రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లు లేవన్నారు కిషన్ రెడ్డి

తొమ్మిదేళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్నాన్ని దోచుకుంటే..ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు పెట్డడానికి వాడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ట్యాక్సీ కడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, కుంభకోణాలేనని, కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పాలనని, గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. దేశ ప్రజల కోసం, దేశం కోసం నరేంద్ర మోదీ పాలన చేస్తున్నారని, యూపీఏ పాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించారన్నారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు, మత కల్లోహాలు జరిగాయన్నారు. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచి వేసిందన్నారు. పేద ప్రజల కష్టాల తీర్చడానికి నరేంద్ర మోదీ పని చేస్తున్నారన్నారు. పేద కుటుంబంలో మోదీ పుట్టారు కాబట్టే పేద ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. గత యూపీఏ హయాంలో దేశంలో కరెంటు కొరత ఉండేదన్న కిషన్ రెడ్డి, గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో కరెంటు కోతలు లేవన్నారు. ఎరువుల కొరతలు లేవని, మోదీ నాయకత్వంలో దేశంలో మంచి వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలతోపాటుగా తెలంగాణ బీజేపీ అగ్రనేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డితో సహా స్థానిక నేతలు పాల్గొన్నారు.


