మారిషస్‌లో మోదీ భావోద్వేగం..27 ఏళ్ల నాటి ఫోటోలు షేర్ చేసిన ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్లిన సంగతి తెలిసిందే. 1998లో మొదటిసారి మోదీ బీజేపీ కార్యదర్శిగా మారిషస్‌లో అడుగుపెట్టారు. అప్పట్లో రామాయణం ఔచిత్యాన్ని గురించి అక్కడ ప్రసంగించారు. మారిషస్ హిందూ దేవాలయాతో కూడి, అధిక భారత సంతతి జనాభాతో ఉండడం వల్ల మినీ ఇండియాగా పిలువబడుతోంది. తర్వాత మళ్లీ 17 ఏళ్లకు అక్కడ ప్రధాని హోదాలో 1015లో ఆ దేశ నేషనల్ డేలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్లకు 57వ నేషనల్ డేకు చీఫ్ గెస్టుగా పాల్గొంటున్నారు. మారిషస్ హిందూ మహాసముద్రంలో భారత్‌కు కీలక భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉన్న ఈ దేశం చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా మనకు అనుబంధం కలిగి ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భావోద్వోగానికి గురయిన మోదీ అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
