మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించిన మోడీ
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్‌భాయ్ రూపానీ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. విమాన ప్రమాదంలో అసువులు బాసిన వాళ్లలో విజయ్ రూపానీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.గుజరాత్ వెళ్లిన ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగారు. అనంతరం విజయ్ రూపానీ ఇంటికివెళ్లి కుటుంబసభ్యులతో తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.భుజం భుజం కలిపి.. తామిద్దరం కలిసి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో కూడా విజయ్‌భాయ్ వినయపూర్వకంగా కష్టపడి పనిచేసేవారని మోదీ అన్నారు. పార్టీ సిద్ధాంతానికి దృఢంగా కట్టుబడి ఉండేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతోశ్రద్ధాశక్తులతో సేవలందించారని మోదీ కీర్తించారు.
