పీవీకి నివాళులు అర్పించిన మోడీ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రధాని మోడీ నివాళి అర్పించారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మోడీ తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు పీవీ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పీవీ నాయకత్వం, జ్ఞానం అమోఘమని కీర్తించారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ఆయనకు గౌరవం ఇస్తూ భారత రత్న పురస్కారాన్ని ప్రకటించినట్లు ప్రధాని మోడీ గుర్తు చేశారు.