Home Page SliderTelangana

తెలంగాణాలో 11,350 కోట్ల రూపాయల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

హైదరాబాద్‌ పెరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు నేడు రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నారు. ఐదు జాతీయరహదారి రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. వేదమంత్రోచ్ఛారణలతో పలు శిలా ఫలకాలను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆవిష్కరించారు. ప్రపంచ స్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్‌ను 720 కోట్లరూపాయలతో మార్చబోతున్నారని రైల్వేమంత్రి తెలియజేశారు. దేశంలో 14 వందేభారత్ రైళ్లను ప్రారంభించారని, వాటిలో రెండు తెలంగాణాకే ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  బీబీనగర్ ఎయిమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది పరచడానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠభారత్ పేరుతో రైల్వేలప్రాజెక్టులను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని పలు ఎమ్ఎమ్‌టీసీ రైళ్లను కూడా ప్రారంభించారు.