నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మోదీ సర్కార్
నీతిలేని పాలనకు.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా కేంద్రం మారిందంటూ దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. 11 మంది నాయకులపై ఈడీని, సీబీఐని పంపించారని చెప్పారు. కవితకు ఇచ్చినవి ఈడీ సమన్లు కాదని.. మోదీ సమన్లన్నారు కేటీఆర్. ఈడీ, ఐటీ రెయిడ్స్ అన్నీ కూడా విపక్షాలపైనే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారన్నారు. 5424 కేసుల్లో 23 కేసుల్లో మాత్రమే నేరారోపణ జరిగిందన్నారు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటూ దుయ్యబట్టారు. ముద్రా పోర్టులో 21 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికినా అదానీపై చర్యల్లేవన్నారు. బీజేపీలో చేరిన నేతలపై కేసులు మాత్రం ఉండవన్నారు. ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికి ఆరేస్తానని మోదీ హెచ్చరిస్తున్నారంటూ ఆక్షేపించారు కేటీఆర్.
