అమరావతికి మోదీ..
ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని మోదీ త్వరలోనే రానున్నారు. ప్రపంచస్థాయిలో అమరావతి నగర నిర్మాణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 నుండి 20 లోగా నవనగరాల నిర్మాణ శంకుస్థాపన చేయాలని ప్రధాని నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి కేంద్రం వార్షిక బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.37,702 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు తెరిచారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా. అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..