Home Page SliderNational

“మోదీకీ దేశంలోని అన్నీ రాష్ట్రాలు సమానమే”: కిషన్ రెడ్డి

ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వందే భారత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమినికి కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి కూడా హజరయ్యారు.

 ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ముందుగా తెలంగాణ ప్రజల కు ఎన్నో మౌలిక వసతులు కల్పించడానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరూ తిరుపతి వెళ్లాలనుకుంటారు. వారి కోసమే వందే భారత్ ట్రైన్ ను తెలంగాణ, ఏపీ ప్రజలకు ప్రధాని అంకితం చేశారన్నారు. దేశంలో మొత్తం 14 వందేభారత్ ట్రైన్ లు ఓపెన్ అయితే అందులో 2 ట్రైన్ లు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని ఇచ్చారన్నారు. అంతేకాకుండా 700 కోట్ల తో సికింద్రాబాద్ స్టేషన్‌ను వచ్చే 40 ఏళ్ల వరకు సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణాలో మహబూబ్ నగర్ కు ఇప్పటి వరకు సింగిల్ లైన్ మాత్రమే ఉందన్నారు. అయితే తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనందు వల్లే MMTS -2 ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నారు. అటువంటి సమయంలో బీజేపీ MP లు అందరం కలిసి ప్రధానిని అడిగి నిధులు తెచ్చామన్నారు. దాంతో తెలంగాణాలో14 MMTS ట్రైన్స్  ప్రారంభం అయ్యాయన్నారు. జాతీయ రహదారులకు ₹7,864 కోట్లతో  ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు. తెలంగాణాలో  ఎయిమ్స్ కు కూడా ప్రధాని భూమి పూజ  చేశారని తెలిపారు. కాగా తెలంగాణాలో అంతర్జాతీయ స్థాయి లో వైద్యం అందుతుందన్నారు. ప్రధానికి దేశంలో అన్ని రాష్ట్రాల సమానమేనన్నారు.అందుకే ప్రధాని జాతీయ రహదారుల కోసం ₹ లక్ష కోట్లకు పైగా తెలంగాణకు నిధులు ఇచ్చారని వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రజలు కు ఎంతో లాభమన్నారు. కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రజలు మోడీకి మద్దతు తెలపాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.