మోదీ-ఆదాని భాయి భాయ్
కాంగ్రెస్ యువనేత,ఎంపి రాహుల్ గాంధీ , వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో వినూత్న నిరశన కార్యక్రమం చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మెంబర్స్, ఆ పార్టీ పార్లమెంట్ వ్యవహారాల ముఖ్యులతో కలిసి మాస్క్‌లు ధరించి ఆదాని వ్యవహారంపై జేపిసి వేయాలని డిమాండ్ చేశారు. ఆదాని ఇష్యూ పై దేశవ్యాప్తంగా చర్చజగరుతుండగా ..పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడం ఏంటని వారిరువురూ ప్రశ్నించారు. అమెరికా ఫెడరల్ కోర్టులో సైతం ఆదానిపై కేసులు నమోదైనా పట్టించుకోపోవడం అనేది దేశానికి సిగ్గుచేటైన పరిణామమన్నారు.భారత్ ఖ్యాతిని అంతర్జాతీయంగా మంటగొలిపారని రాహుల్ మండిపడ్డారు.మోదీ-ఆదాని ఇద్దరు మంచి దోస్తులని దాని కారణంగా జెపిసీ వేయడం గానీ, చర్చకు అనుమతించడం గానీ చేయడం లేదని విమర్శించారు. సెల్ ఫోన్‌లు చేతపట్టుకుని ఆవరణ అంతా తిరుగుతూ నిరశన వ్యక్తం చేశారు.