దేశవ్యాప్తంగా విజయవంతమైన ‘ఆపరేషన్ అభ్యాస్’
పాక్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్‌తో గట్టిగా బుద్ది చెప్పిన భారత ప్రభుత్వం ఇప్పుడు సాధారణ పౌరులను యుద్ధభయం పోగొట్టడానికి సమాయత్తం చేస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాలలో వీటిని నిర్వహిస్తున్నారు. దీనిలో సైరన్ అత్యంత కీలకమైనది. పలు ప్రాంతాలు నేడు సైరన్ మోతలతో హోరెత్తిపోయాయి. గగనదాడులపై హెచ్చరికలు, బ్లాకౌట్ చేసే తీరు, గాయపడ్డవారిని కాపాడడం వంటివన్నీ మాక్ డ్రిల్ పరిధిలోకి వస్తాయి. దీనికి ఆపరేషన్ అభ్యాస్ అ పేరును పెట్టారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌లో 4 చోట్ల, విశాఖలో 2 చోట్ల ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.

