Home Page SliderNational

చిన్నారిని హింసించిందంటూ మహిళా పైలట్‌పై మూకుమ్మడి దాడి

ఢిల్లీలోని ఒక మహిళా పైలట్, ఆమె భర్తపై మూకుమ్మడి దాడి చేశారు స్థానికులు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన ఒక మహిళా పైలట్ ఒక పదేళ్ల చిన్నారిని పనిలో పెట్టుకుని ఆమెను తీవ్రంగా హింసించారంటూ ఆరోపణలు చేస్తున్నారు చిన్నారి  బంధువులు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపలే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ దంపతులపై ఆగ్రహంతో విరుచుకు పడ్డారు.  మూకదాడికి పాల్పడ్డారు. ఈ దంపతులిద్దరూ ఎయిర్ లైన్స్ ఉద్యోగులే. రెండునెలల క్రితమే ఒక 10 ఏళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఈ ఉదయం బాలికను చూసేందుకు ఆమె బంధువు రావడంతో వీరిద్దరూ బాలికను హింస పెట్టినట్లు తెలుసుకున్నారు. వీరిపై దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నందుకు పోలీసులు వీరిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.