ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత రెండోసారి హాజరయ్యారు. ఈనెల 11న కవితను విచారించిన ఈడీ 16న విచారణకు రావాలని కోరింది. ఐతే మొత్తం వ్యవహారంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణకు ఆమె హాజరుకాలేదు. ఈడీ అడిగిన పత్రాలను లాయర్ సోమ భరత్ ద్వారా ఈడీకి పంపించారు. కేసు కోర్టులో విచారణలో ఉన్నందున హాజరు కారదని ఆమె భావించారు. ఐతే 20వ తారీఖున విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆమెను కోరింది. ఈడీ విచారణ సందర్భంగా కవితతోపాటుగా ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, లాయర్ సోమ భరత్ ఉన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు రెండోసారి సోమవారం విచారణకు హాజరయ్యారు. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కవిత ప్రమేయంపై ED విచారణ జరుపుతోంది. ఈడీ అన్యాయంగా, పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత, మార్చి 16న ఏజెన్సీ ముందు హాజరుకాకపోవడంతో ఈడీ ఆమెకు సోమవారం హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణ సమయంలో… కవితను తొమ్మిది గంటల పాటు విచారించినప్పుడు ఈడీ సమన్లు పంపింది. ఈడీ విచారణలో భాగంగా ఆమె ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. గతంలో కవిత, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై ఇద్దరినీ ఈడీ కలిసి విచారించినట్లు సమాచారం. ఈ విచారణ సందర్భంగా తాను కవితకు బినామీనని, అరుణ్ పిళ్లై అరెస్టు ఒప్పుకున్న తర్వాత కవితకు ఈడీ సమన్లు పంపించింది. అయితే కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా తనపై ఈడీ ఒత్తిడి చేసిందని పిళ్లై విమర్శించారు.

కవిత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా ముఖ్యుడు పి శరత్ చంద్రారెడ్డి , మరికొందరు సౌత్ గ్రూప్‌గా ఏర్పడ్డారని ఈడీ భావిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 100 కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు ఇచ్చారని ఈడీ నిర్ధారిస్తోంది. ఢిల్లీలో మద్యం వ్యాపారంపై పట్టు సాధించేందుకు నేతలు ఇందుకు ముడుపులు చెల్లించారన్నది ఈడీ అభియోగం. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఈ భారీ మొత్తాన్ని వినియోగించుకుందని ఆరోపణలున్నాయి. సౌత్ గ్రూప్‌కు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, కవిత మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల ప్రాతినిధ్యం వహించారని ఈడీ ఆరోపించింది. కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను తాను ఎప్పుడూ కలవలేదని, తన పేరును అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని కవిత పేర్కొన్నారు.

