Andhra PradeshHome Page SliderPolitics

స్టీల్‌ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంటుకు కేంద్రం  వేల కోట్ల ప్యాకేజిని ప్రకటించినా కార్మికులకు సంతృప్తి లేదని, ప్యాకేజిపై వారి ఆశకు అంతుండాలని వ్యాఖ్యానించారు. యూనియన్ నాయకులు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయితే వారికి నచ్చడం లేదు. పరిష్కారం కాకుంటేనే వారికి హ్యాపీగా ఉంది. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. అంటూ మండిపడ్డారు.