ఎమ్మెల్యే స్కిట్..నవ్వాపుకోలేకపోయిన చంద్రబాబు, పవన్
ఏపీ ఎమ్మెల్యేలు వేసిన స్కిట్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు పడీ పడీ నవ్వారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్, ఎచ్చర్య ఎమ్మెల్యే ఈశ్వరరావు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కామెడీ స్కిట్ ప్రదర్శించారు. రాలిపోయే పువ్వా అనే పాటను వారు అభినయించిన తీరు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాటను ఇంటికెళ్లే వరకూ మరిచిపోకుండా నవ్వుతూంటానని పవన్ పేర్కొన్నారు. వీరిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఏపీ ఎమ్మెల్యేలు. ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పవన్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు హాజరయ్యారు.