ఎమ్మెల్యే రాజాసింగ్ కు అస్వస్థత..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. మెడికల్ టెస్టుల అనంతరం డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ప్రకటన చేశారు. ‘నాకు హెర్నియా ఆపరేషన్ అయ్యింది. 15 డేస్ వరకు రెస్ట్ లో ఉంటాను. అందరికీ ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.