మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
లగచర్ల అధికారుల దాడి కేసులో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దాడి వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న భోగమోని సురేష్ తో ఫోన్‌లో 42 సార్లు మాట్లాడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర తెల్లవారుఝాము నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ బందుబస్తు ఏర్పాటు చేశారు. కాగా నరేందర్ రెడ్డి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

