బాలిక మిస్సింగ్ .. గోనెసంచిలో డెడ్ బాడీ..
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ కుటుంబంతో వలస వచ్చి సూరారంలో ఉంటున్నాడు. ఈ నెల 12న తన కుమార్తె జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక డెడ్ బాడీ లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.