Home Page SliderInternational

హ్యాండ్ గన్ సృష్టికర్త మృతి

Share with

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి గాంచిన మారాణాయుధాల్లో “హ్యాండ్ గన్” అగ్రస్థానంలో ఉంటుంది.అయితే ఆ హ్యాండ్ గన్‌ని సృష్టించిన వ్యక్తి గ్యాస్టన్ గ్లాక్.కాగా ఇవాళ ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రియాకు చెందిన గ్యాస్టన్ గ్లాక్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పరిస్థితి విషమించినట్లు సమాచారం. దీంతో ఆయన 94 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా గ్యాస్టన్ గ్లక్‌కు భార్య,ఇద్దరు కుమారులు,ఓ కుమార్తె ఉన్నారు. అయితే హ్యాండ్ గన్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న తుపాకుల్లో ఒకటిగా ఉంది. కాగా ఈ వెపన్‌ను ఎక్కువగా పోలీసులు, మిలిటరీ, నేరస్థులు వినియోగిస్తున్నారు. గ్యాస్టన్ గ్లక్ ఈ తుపాకీని 1979లో కనిపెట్టారు. అయితే ఈ తుపాకీని 1982 నుంచి వాడుకలోకి తీసుకువచ్చారు.