అన్నవరంలో పెళ్లిబస్సుకు తప్పిన ముప్పు..
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం నుండి రాజమహేంద్రవరం వెళ్తున్న పెళ్లి బృందం ప్రయాణించే బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బయల్దేరిన కొద్దిసేపటికే సత్యగిరి ఘాట్ రోడ్డులో బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. బస్సులోని వారందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ తెలివిగా, చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్‌కు ఢీకొట్టించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనితో అందరూ డ్రైవర్‌ను అభినందించారు.