హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..మంత్రి కీలక వ్యాఖ్యలు
72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలకు సంబంధించి ప్రారంభోత్సవం రేపు బేగంపేటలో జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పోటీలపై స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ “తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవని, ఇది చరిత్రాత్మక కార్యక్రమం. మహిళల ఆత్మసౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు పేరు, ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతుంది. ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది మంచి ఆవకాశం. ప్రభుత్వంపై విమర్శలకు, రాజకీయ కోణాలకు ఇది సమయం కాదు. 140 దేశాల నుండి పోటీదారులు, దేశవిదేశాల నుండి వేలమంది వస్తున్నారు. దీనిద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది”. అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.