తిరుమలలో అపచారం
భూలోక వైకుంఠం తిరుమలలో అపచారం జరిగింది. ఆలయానికి సమీపంలో గల రామ్‌భగీచా బస్టాండు వద్ద కొందరు గుడ్లు తింటూ పట్టుబడ్డారు. తిరుమలలో కేవలం శాఖాహారమే తీసుకోవాలనే సంగతి తెలిసిందే. 18 మంది బృందం ఈ అపచారానికి పాల్పడినట్లు తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఆహారాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీ కేంద్రాన్ని దాటుకుని ఈ నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.