Home Page SliderNational

పుణె యాక్సిడెంట్ కేసులో మైనర్ నిందితుని విడుదల

పుణెలో కారు యాక్సిడెంట్ చేసి, ఇద్దరు టెకీల మృతికి కారణమైన మైనర్ బాలుని విడుదలకు ముంబై హైకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె కారు యాక్సిడెంట్ చేసిన మైనరు బాలుడిని కస్టడీలో ఉంచరాదని కోర్టు తీర్పు ఇచ్చింది.  నిందితుడు మైనర్ కావడంతో అతనిని రిమాండ్‌లో ఉంచకూడదని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాక్సిడెంటు దురదృష్టకరమైన ఘటన అని, కానీ మైనరును అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచడం చట్టరీత్యా సరైన పని కాదని పేర్కొంది. ఈ కేసులో నిందితుడి తల్లిదండ్రులను, అతని బ్లడ్ శాంపిల్స్ మార్చిన వైద్యులను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అందుకే అతని సంరక్షణ బాధ్యతను మేనత్తకు అప్పగించారు.