ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన తనిఖీలలో భాగంగా రోగులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్యులు అందిస్తున్న సేవలను ఆరా తీశారు. జీబీ సిండ్రోమ్ కేసులపై ఆందోళనలు వద్దని, ఈ కేసుల చికిత్స కోసం మందులు అందుబాటులోనే ఉన్నాయన్నారు. ఆసుపత్రులలో సమస్యల పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

