“పాక్‌పై మానవబాంబులా మారతా”…మంత్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్‌పై తాను యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మానవబాంబులా మారి పాక్‌పై సూసైడ్ ఎటాక్ చేస్తానని పేర్కొన్నారు. “మేమంతా భారతీయులం. మాకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. యుద్ధం వస్తే నేను మానవబాంబులా మారడానికి సిద్ధంగా ఉన్నా, నా ఒంటికి కట్టుకుని పాక్‌లోకి వెళ్లి, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అల్లాపై ఒట్టు, నేను జోక్ చేయట్లేదు” అంటూ పేర్కొన్నారు.