Andhra PradeshHome Page Slider

ఏపీ వాలంటీర్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తారా?లేదా తొలగిస్తారా? అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ ఎన్నికలకు ముందు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తీసేయబోమని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపై కేబినెట్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. దీంతో ఏపీలో వాలంటీర్లను పక్కన పెట్టేస్తునట్టేనా అని కొందరు ప్రశ్నించార. దీనిపై మంత్రి పార్థసారధి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన చేస్తుందన్నారు. అందువల్లే ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో  వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే జూలై 1న పెన్షన్ల పంపీణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించామని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు.