మండుటెండలో రిక్షా తొక్కిన మంత్రి..
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు రిక్షా కార్మికులతో కలిసి మండుటెండలో 4 కిలోమీటర్లు రిక్షా తొక్కారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో మే డే సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారితో కలిసి రిక్షా తొక్కారు. ఈ వేడుక అనంతరం శ్రామికలను మెచ్చుకుంటూ వారికి టీషర్టులు, టవళ్లు పంపిణీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రవ్యాప్తంగా మేడే కార్యక్రమాలలో పాల్గొన్నారు.

