NationalNews Alert

ప్రభాస్‌ను పరామర్శించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 16న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి రానున్నారు. పెదనాన్నను కోల్పోయి.. బాధలో ఉన్న ప్రభాస్‌ను పరామర్శించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నట్టు BJP వర్గాలు తెలిపాయి. కృష్ణంరాజు BJPలో చేరి కేంద్రమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం పట్ల ఇప్పటికే పార్టీలోని కొందరు ప్రముఖలు తమ సానుభూతి తెలుపగా.. ప్రధాని మోదీ కూడా కృష్ణంరాజు మరణం పట్ల చింతిస్తున్నట్టు ఆదివారం ట్వీట్ చేశారు.