మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ శాఖలు కేటాయింపు
రాష్ట్ర కేబినెట్ లో కొత్త గా చేరిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ కు ప్రభుత్వం శాఖలను మంగళవారం కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పట్టణాభివృద్ధి శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ తో పాటు ఏ మంత్రికి కేటాయించని ఇతర విభాగాలు ఉన్నాయి. వాటిలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను అజహరుద్దీన్ కు కేటాయించారు. ఇక గత జూన్ లో మంత్రివర్గలో చేరిన అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖలను ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ఆయన వద్దనున్న మైనార్టీ శాఖను అజహరుద్దీన్ కు అప్పగించింది.

