ఆర్టీసీ బస్సులో మంత్రి..
హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తూ వారికి కావల్సిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మహిళల ఫ్రీ బస్సు పథకం ఎలా అమలు జరుగుతోందని ఆరాలు తీశారు. ప్రయాణికులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో బస్సుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కారులో జిల్లా కలెక్టరేటుకు ప్రయాణమైన ఆయన మార్గమధ్యంలో బస్సు ఎక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

