Home Page SliderTelangana

గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. రాష్ట్రప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ నిరాకరించడంతో ఆయన మండిపడ్డారు. ఎరుకలు, విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ అవకాశాన్నిముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తే, వారిని ఆ పదవులకు దూరం చేయడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని, గవర్నర్ తమిళిసై వారికి సహకరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీలో ఉంటూనే తమిళిసై గవర్నర్ అయ్యారు. కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్‌ఎస్‌లో ఉంటూ ఎమ్మెల్సీ కాకూడదా అని ప్రశ్నించారు. గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని, రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ  కలిసి బీజేపీకి బుద్ది చెప్పాలని హరీష్ రావు పేర్కొన్నారు.