NationalNewsNews Alert

మంత్రి గోవింద్‌రామ్ మేఘ్‌వాల్ సంచలన వ్యాఖ్యాలు

భారతీయ మహిళలను ఉద్ధేశించి  రాజస్థాన్ విపత్తు నిర్వహణ , పరిహార శాఖ మంత్రి గోవింద్‌రామ్ మేఘ్‌వాల్ చేసిన వ్యాఖలు వైరల్‌గా మరాయి. అమెరికా , చైనా వంటి దేశాల్లోని మహిళలు ఆధునిక ప్రపంచం దిశగా అడుగులు వెస్తుంటే , భారతీయ మహిళలు మాత్రం ఇప్పటికీ జల్లెడలో నుండి చంద్రున్ని చూస్తూ , కార్వా చౌథ్ నాడు భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా దురదృష్టకరమైన అంశం ఇంకోటి ఉండదని మేఘవాల్ పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖాలు భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్నాయని , ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

మెన్న జరిగిన డిజీఫెస్ట్ కార్యక్రమంలో గోవింద్‌రామ్ మాట్లాడుతూ “ చైనా , అమెరికా దేశాల్లోని మహిళలు సైన్స్ ప్రపంచంలో జీవిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన దగ్గర మహిళలు మాత్రం ఇంకా కార్వా ఛౌథ్ నాడు జల్లెడలో నుండి చూస్తూ భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేస్తున్నారు ” అని విమర్శించారు. ప్రజలు ఇతరులను మూఢనమ్మకంలోనికి  నెడుతున్నారు. మతం , కులం పేరుతో పోరాడేలా ఇతరులను మార్చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం పాల్గొన్నారు. ఈ వ్యాఖ్యాలను ఖండించిన జీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి , శాసనసభ్యుడు రామ్‌లాల్‌శర్మ , వ్యోమగామి కల్పనాచావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి , అనేకమంది భారతీయ మహిళలు పైలెట్లుగా పనిచేస్తున్న సంగతిని మంత్రి గుర్తించాలని దుయ్యబట్టారు. ఆయన కోట్లాది మంది మహిళలను అవమానపరిచారని , ఈ విషయంలో మేఘ్‌వాల్ క్షమాపణలు చెప్పి , ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారతీయ మహిళలు ఆచారాలు , సాంప్రదాయలను పాటిస్తారని , అంతే కాక తమ వ్యక్తిగత , వృత్తి జీవితాలను సమానంగా ఏలా చూసుకోవాలో వారికి బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. తనపై వస్తున్న విమర్మల పై స్పందించిన మేఘ్‌వాల్‌ దిద్దుబాటు చర్యలను మొదలు పెట్టారు. తాను ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం , విద్యను పెంపొందించాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. “ నేను కార్వా ఛౌథ్‌కు వ్యతీరేకం కాదని , ఆ పండుగని ఎవరు అయిన జరుపుకోవచ్చన్నారు. శాస్త్రీయ స్వభావం ప్రాముఖ్యతపై మాత్రమే నేను మాట్లాడాను ” అని స్పష్టం చేశారు.