రాజాసింగ్ అకౌంట్లను తొలగించిన మెటా
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు టెక్ దిగ్గజ సంస్థ మెటా షాక్ ఇచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఫేస్ బుక్, ఇన్స్ స్టా నుంచి రాజాసింగ్ అకౌంట్ లను తొలగించింది. ఇటీవల ఆయన ద్వేషపూ రితంగా పోస్టులు చేయటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే.. ఆయనకు ఫేస్ బుక్ పేజీల్లో 10లక్షలకు పైగా, ఇన్స్ స్టా లో లక్షా 55 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీనిపై రాజాసింగ్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తోందని మండిపడ్డారు. తనతో పాటు తన కుటుంబసభ్యులు, స్నేహితులు, మద్దతుదారుల అకౌంట్లను కూడా బ్లాక్ చేశారని ఎక్స్ వేదికగా వెల్లడించారు.