మెగాస్టార్ తల్లికి అస్వస్థత
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం ఇవాళ తెల్లవా రుజామున ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలు, అధికారులతో సమీక్షలను రద్దు చేసుకుని హుటా హుటిన హైదరాబాద్ కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


 
							 
							