Breaking NewsHome Page SliderTelangana

తెలంగాణాలో త్వ‌ర‌లో మెగా నోటిఫికేష‌న్‌

తెలంగాణ రాష్ట్రంలోని విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని, ఎనిమిది కొత్త జూనియర్‌ కాలేజీలను ప్రారంభించామని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడించారు. అలాగే 11 వేల మంది ఉపాధ్యాయులను, 1,200 మంది లెక్చరర్లను నియమించినట్లు ఆయ‌న తెలిపారు.విద్యపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్‌ సర్కార్ సంక్షేమానికి, విద్యారంగానికి అధికా ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. మహిళా యూనివర్సిటీకి రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు.యువతకు ఉద్యోగాలు, ఉపాధి దక్కేలా విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులను ప్రారంభినట్లు వెల్లడించారు. త్వరలోనే యూనివర్సిటీల్లోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. దశాబ్దకాలంగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లల సంఖ్య పెరుగుతోందని, ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల చేరికలు గణనీయంగా తగ్గాయని అన్నారు. దీంతో ఒక్క విద్యార్ధి కూడా చేరని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 79 పాఠశాలలను తిరిగి తెరిపించామన్నారు.