Andhra PradeshNewsNews Alert

విశాఖతీరంలో మెగా క్లీనింగ్ డ్రైవ్

గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్(GVMC) ఒక కొత్త నినాదాన్ని తీసుకువస్తోంది. విశాఖబీచ్‌ను శుభ్రం చేయడానికి, అందంగా తయారుచేయడానికి వాలంటీర్లను ఆహ్వానిస్తోంది. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకూ 28 కిలోమీటర్ల దూరంలో దాదాపు 40 ప్రాంతాల్లో 25 వేల మంది వాలంటీర్లతో డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో చేతులు కలపమని ఆహ్వానిస్తోంది. కాలుష్యనివారణకు, వ్యర్థాల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ కవర్లు , ఇతర వ్యర్థాలు తొలగించాలని అభ్యర్థించింది. దీనికోసం ఆగస్టు 26వ తేదీ ఉదయం ఆరు గంటల నుండి, ఎనిమిది గంటల వరకూ సమయాన్ని నిర్ణయించింది. ఈకార్యక్రమంలో విశాఖమేయర్, కలెక్టర్, కమీషనర్ పాల్గొనబోతున్నారు.