‘ఎవరి కోసమూ ఈ సమావేశాలు ఆగవు’..చంద్రబాబు
ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 22 వరకూ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ సమావేశాలలో రాష్ట్రంలోని కీలక బిల్లులు, చర్చలకు కావలసిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరి కోసమూ ఈ సమావేశాలు ఆగవని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసం శనివారం కూడా సభ నిర్వహిస్తామని, కొన్ని రోజుల పాటు రెండు పూటలా సభ జరుగుతుందని పేర్కొన్నారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు గైర్హాజరు కాకుండా హాజరు కావాలంటూ పేర్కొన్నారు. మరోపక్క వైసీపీ నేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

