హైదర్‌గూడలో టీపీసీసీ నేతల సమావేశం
తెలంగాణాలో ప్రస్తుతం అందరి దృష్టి మునుగోడు ఉపఎన్నికలపైనే ఉంది. ఈ మేరకు పార్టీలన్నీ వరుస ప్రచారాలతో, సమావేశాలతో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలలో భాగంగానే ఈ రోజు హైదర్‌గూడలో పార్టీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ సమావేశానికి టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ నేతలు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంపై ప్రధానంగా చర్చించనున్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై చర్చించనున్నారు. అంతేకాకుండా మునుగోడు ఉపఎన్నికలో గెలుపు సాధించడానికి ఎటువంటి వ్యుహాలు రచించాలి అనే ప్రధాన అంశాలను ఈ సమావేశాలలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.