రాయపర్తి ఎస్.బి.ఐ.లో భారీ చోరీ
ఎంత నిఘా పెట్టినా..ఎంత భద్రత పెంచినా…నేరగాళ్ల చోరీలు మాత్రం మూడో కన్నుకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. సైన్స్ వర్సెస్ క్రైం సెన్స్ అన్న విధంగా మారిపోయింది ప్రపంచం. హార్ వర్డ్ యూనివర్సిటీ చదువులు,ఐఐటి పట్టాలు కూడా నేరగాళ్ల తెలివితేట ముందు దిగదుడుపే అనుకునేంతగా నేరాలు వ్యాప్తి చెందుతున్నాయి. తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తిలో దీనికి సంబంధించిన ఓ ఘటన ఉదాహరణగా మారింది.రాయపర్తి ఎస్.బి.ఐ. చుట్టూ నిఘా కెమేరాలు డేగకళ్లతో కాపలా కాస్తున్నా…. దొంగలు మాత్రం దర్జాగా బ్యాంక్ లోకి ప్రవేశించి చోరీ చేశారు. ఏకంగా గోల్డ్ లాకర్ నే పగలగొట్టి ఆభరాణాలు ఎత్తుకుపోయారు.గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లాకర్ ని ధ్వంసం చేసి ఉన్న బంగారాన్నంతా ఊడ్చేశారు.అసలు ఎంత ఎత్తుకెళ్లారో అనేది కూడా కనుగొనలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

