Home Page SliderInternational

పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 17 మంది మృతి

పాకిస్తాన్‌లోని ‘స్వాత్’ లోయలో భారీ పేలుడు సంభవించింది. అక్కడి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో భారీ పేలుడు జరిగింది. అక్కడి రూంలో ఉంచిన పేలుడు పదార్థాలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనలో 17 మంది మరణించినట్లు సమాచారం. దీనిలో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. ఈ పేలుడు వల్ల ఆ భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనకు ఉగ్రవాదులు కారణం కాదని, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని అధికారులు తెలియజేశారు.