సిరియాలో సామూహిక సమాధులు..
సిరియాలో నియంత అసద్ పాలనలోని అకృత్యాలు, దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసద్ దేశాన్ని వదిలి వెళ్లాక, అతడు చేసిన పనులను మీడియా ప్రజలకు తెలియజేస్తోంది. డమాస్కస్‌కు సమీపంలోని నఝాలోని సామూహిక సమాధులను యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రాప్ పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణం నాజీల కాలం నుంచి ఇంత ఘోరం చూడలేదన్నారు. మిషినరీ ఆఫ్ డెత్ పేరుతో లక్ష మంది పైగా కిడ్నాప్ అయ్యారని, వారిని చనిపోయేంత వరకూ చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వారిని రహస్య పోలీసులు డమాస్కస్ శివార్లలోని హత్యలు చేసేవారని, శవాలను ట్రక్కుల్లో తరలించి సామూహికంగా పాతిపెట్టేవారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి 40 సామూహిక సమాధులు కనిపెట్టామని, తప్పిపోయిన వారి ఆత్మీయుల సమాచారం తెలుసుకోవడానికి సిరియా ప్రజలకు అమెరికా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

