ప్రభాకర్ రెడ్డి ఇంట వివాహ వేడుక
దుబ్బాక ఎమ్మెల్యే,మాజీ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటి కళ్యాణ వేడుక అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పార్టీలకు అతీతంగా పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించారు .హైద్రాబాద్‌లోని హైటెక్ సిటీలో జరుగుతున్న ఆత్మీయ మిత్రుని కుమార్తె వివాహమహోత్సవంలో పాల్గొని సందడి చేశారు.కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి ,ఏఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ తనయుడు మహేష్ రెడ్డి కుమారుడు నితీష్ లను ఆప్యాయంగా పలుకరించి అక్షితలు వేసి ఆశీర్వదించారు.ఈ శుభవేడుకలో ప్రముఖ సెఫాలజిస్ట్,నిర్మాత,బహుముఖ వాణిజ్యవేత్త ,ఆరా గ్రూప్ సంస్థల అధినేత ఆరా మస్తాన్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులున్నారు.